- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
vote chori: హర్యానాలో బ్రెజిల్ యువతికి 22 ఓట్లు.. రాహుల్ గాంధీ ఆరోపణలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ల చోరీ అంశంపై వరుసగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana elections) బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ గెలవబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయినప్పటికీ ఫలితాలు తారుమారు అయ్యాయన్నారు. పోస్టల్ బ్యాలెట్‍లోనూ కాంగ్రెస్‍కే హెడ్జ్ కనిపించినప్పటికీ కేవలం 22,779 ఓట్ల తేడాతో హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఓట్ల దొంగలను సీఈసీ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. వాళ ఢిల్లీలో ఓట్ చోరీపై 'H' ఫైల్స్ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
బ్రెజిల్ మోడల్‍కు హర్యానాలో 22 ఓట్లు:
హర్యానా ఫలితాలను చూసి తాను షాక్‍కు గురయ్యానని.. ఈ ఫలితాలపై నా టీమ్ చేసిన అనాలసిస్‍లో షాకింగ్ అంశాలు గుర్తించామని రాహుల్ గాంధీ చెప్పారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్ లలో 22 ఓట్లు ఉన్నాయని ఆమె బ్రెజిల్‍కు చెందిన మోడల్‍గా (Brazilian model) గుర్తించామన్నారు. మహిళ ఫోటో ఒకటే ఉంది కానీ పేర్లు, వయస్సు, జెండర్ వేరుగా ఉందన్నారు. సీమా, స్వీటీ, సరస్వతి.. ఇలా వివిధ పేర్లతో ఒకే యువతికి ఓట్లు ఉన్నాయని ఆ పేరుతో 22 చోట్ల ఓట్లు పడ్డాయన్నారు. ఒక నియోజకవర్గంలో ఒకే ఫోటోతో 100 ఓట్లు ఉన్నాయని ఆమె వంద చోట్ల ఓటు వేసిందన్నారు. ఒకే ఇంట్లో 500 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి వ్యతిరేకంగా అంచనాలు వేస్తుంటే కౌంటింగ్‍కు ముందు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ మాత్రం మా వద్ద వ్యవస్థ ఉందని మా గెలుపుపై ఎలాంటి చింత పెట్టుకోకండి అని మీడియాతో చెప్పిన వీడియోను ఈ సందర్భంగా రాహుల్ ప్రదర్శించారు.
జెన్ Z గమనించాలి:
రాష్ట్రస్థాయిలో ఓట్ చోరీ జరిగిందని కొందరి ఓట్లను కావాలనే జోడిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలైన పోస్టల్ ఓట్లకు, ఫలితాలకు తేడా ఉందన్నారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని హర్యానాలో 12.5 శాతం ఓట్లు నకిలీవన్నారు. ఇక్కడ బీజేపీకి 48 సీట్లు, కాంగ్రెస్ కు 37 సీట్లు వచ్చాయన్నారు. హర్యాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరునామాలతో 93 వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. నకిలీ ఫోటలతో అనేక మంది ఓటర్లను జాబితాలో చేర్చారన్నారు. ఫేక్ పోటోలతో 1,24,177 ఓట్లు ఉన్నాయన్నారు. ఒకే పేరు, ఫోటోతో అనేక ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్ వేర్ కూడా ఉందన్నారు. ఓట్ల చోరీపై ఈసీ అబద్ధాలు చెబుతోందన్నారు. సాఫ్ట్ వేర్ ఉన్నా 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి ఓట్ల చోరీనే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలో జరిగిందన్నారు. ఇదంతా జెన్ జెడ్ గమనించాలన్నారు.
.






