సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ను సిఫార్సు చేసిన బిఆర్‌ గవాయ్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-27 06:00:18  IST  )

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్‌. గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ను సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును గవాయ్ అధికారికంగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపారు.

సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ను సిఫార్సు చేసిన బిఆర్‌ గవాయ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్‌. గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ (Justice Suryakant)ను సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును గవాయ్ అధికారికంగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ (Union Ministry of Law)కు పంపారు. సుప్రీంకోర్ట్‌లో సీనియార్టీ క్రమంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ తదుపరి స్థానంలో ఉండటంతో ఆయన నియామకానికి అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించారు. ప్రస్తుతం సూర్యకాంత్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. సిఫార్సు చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఆయన దేశానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సుప్రీం కోర్టు CJIగా ఉన్న బి.ఆర్‌. గవాయ్ 2025 నవంబర్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన గతంలో పలు ముఖ్య తీర్పుల్లో భాగమై, రాజ్యాంగ విలువలను కాపాడటంలో తనదైన ముద్ర వేశారు. రిటైర్మెంట్‌ అనంతరం ప్రభుత్వ పదవులు స్వీకరించబోనని గవాయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు, సూర్యకాంత్‌ సుమారు 14 నెలల పాటు దేశ అత్యున్నత న్యాయ పీఠానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆయన నియామకం దేశ న్యాయవ్యవస్థలో మరో కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story