Viral video: రేయ్ ఎవర్రా మీరంతా..! కరెంట్ వైర్లతో ఆటలాడిన బాలురు.. నెటిజన్‌లు షాక్! వీడియో వైరల్

by Ramesh Naini |

విద్యుత్ వైర్లు చాలా ప్రమాదకరమైనవని అందరికీ తెలిసిందే. వాటికి దగ్గరగా వెళ్లడమే ప్రమాదం, కానీ ఇక్కడ కొంత మంది పిల్లలు వాటిని ఆడుబొమ్మలలా వాడుతున్నారు.

Viral video: రేయ్ ఎవర్రా మీరంతా..! కరెంట్ వైర్లతో ఆటలాడిన బాలురు.. నెటిజన్‌లు షాక్! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) విద్యుత్ వైర్లు (Current wires) చాలా ప్రమాదకరమైనవని అందరికీ తెలిసిందే. వాటికి దగ్గరగా వెళ్లడమే ప్రమాదం, కానీ ఇక్కడ కొంత మంది పిల్లలు వాటిని ఆడుబొమ్మలలా వాడుతున్నారు. అవును మీరు విన్నది నిజమే.. కరెంట్ పవర్ లైన్స్ పట్టుకోని వేలాడుతూ హంగామా చేశారు. అంతే కాకుండా నీటిలోకి దూకుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. @desimojito అనే యూజర్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఎడ్యూకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తదని ట్వీట్‌లో చేయడంతో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో ప్రకారం.. చాలా మంది పిల్లలు నీళ్లలో సగం మునిగిపోయి ఉన్న కరెంట్ పోల్ విద్యుత్ వైర్లను పట్టుకోని వేలాడుతూ ఆటలాడుతున్నారు. పవర్ లైన్ పట్టుకొని బాలురు నీళ్లలోకి దూకుతూ ఎంజాయ్ చేశారు. కేరింతలు కొడుతూ విద్యుత్ వైర్లతో సర్కస్ ఫీట్లు చేశారు. ఈ ఘటన నార్త్ ఇండియాలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవల వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా వరకు వరద రావడంతో దగ్గరలోని కరెంట్ స్తంభాలు మునిగిపోయాయి. దీంతో వాటిలో కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వైర్లలో విద్యుత్ సరఫరా బంద్ పెట్టడంతో పిల్లలు వాటిని పట్టుకుని వేలాడుతూ సరదాగా గడిపారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు స్పందించారు. రేయ్ ఎవర్రా మీరంతా అంటూ నెటిజన్‌లు షాక్ అయ్యారు. అవగాహన లేకపోతే, విద్యుత్ లైన్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోకుండా ఇలా ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి వస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. నదికి దగ్గరలో ఎవరు కరెంట్ పోల్ కట్టారని అధికారులపై పలువురు నెటిజన్‌లు మండిపడ్డారు. వీడియో లింక్..

Next Story