Bangladesh border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టివేత

by Shamantha N |

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో(Bangladesh border) భారీగా బంగారం పట్టుబడింది. పశ్చిమబెంగాల్ లోని భారత్- బంగ్లా సరిహద్దుల్లో బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Bangladesh border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో(Bangladesh border) భారీగా బంగారం పట్టుబడింది. పశ్చిమబెంగాల్ లోని భారత్- బంగ్లా సరిహద్దుల్లో బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.3 కోట్ల విలువైన బంగారాన్ని సరిహద్దు భద్రతా దళం(BSF) స్వాధీనం చేసుకుంది. నిఘా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ సిబ్బంది గోల్డ్ బిస్కెట్లు అక్రమంగా రవాణా చేయడానికి యత్నించిన స్మగ్లర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాదాపు 3.5 కిలోలున్న 25 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్ లో రూ.2.96 కోట్లుగా ఉంటుందని అంచనావేశారు. శుక్రవారం సాయంత్రం సరిహద్దుల్లో అనుమానాస్పదంగా ఉన్న బైకర్ ని అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో ఫ్యుయర్ ట్యాంక్ కింద ఉన్న 25 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత స్మగ్లర్ ని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలకు చెందిన నిందితుడు, గత రెండు నెలలుగా బంగ్లాదేశ్ స్మగ్లర్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు అంగీకరించాడు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఒక అధికారి తెలిపారు.

Next Story