Bombay HC: రేపటి లోగా రోడ్లను ఖాళీ చేయాలి.. మరాఠా కోటా నిరసనలపై బాంబే హైకోర్టు సీరియస్

by B.Srinivas |   (  Updated:2025-09-01 15:58:28  IST  )

మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం చేపట్టిన నిరసనలు ఉధృతమైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Bombay HC: రేపటి లోగా రోడ్లను ఖాళీ చేయాలి.. మరాఠా కోటా నిరసనలపై బాంబే హైకోర్టు సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం చేపట్టిన నిరసనలు ఉధృతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు (Bobmay high court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే (Manoj jarange) సహా ఆయన మద్దతుదారులు మంగళవారం నాటికి ముంబై వీధులను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆందోళన శాంతియుతంగా జరగలేదని, నిరసన అన్ని షరతులను ఉల్లంఘించిందని పేర్కొంది. పరిస్థితిని వెంటనే చక్కదిద్దడానికి జరాంగేకు మంగళవారం నాటికి సమయం ఇస్తున్నట్టు తెలిపింది. ఈ నిరసనలపై పిటిషన్ దాఖలు కాగా న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

నిరసనకారులు రూల్స్ ఉల్లంఘించారని, వారు ఆందోళన కోసం నియమించిన ఆజాద్ మైదాన్‌లో బస చేయలేదని, సౌత్ ముంబైలోని అనేక కీలక ప్రాంతాలను రద్దీగా ఉంచారని తెలిపింది. ట్రాఫిక్ అడ్డుకుని నగరాన్ని దిగ్భంధించారని స్పష్టం చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వద్ద మరాఠా కోటా నిరసనకారులు గుమిగూడిన టైంలో కోర్టు ఈ ఆర్డర్స్ జారీ చేయడం గమనార్హం.

Next Story