ఢిల్లీ వచ్చే విమానాన్ని బాంబు బెదిరింపులు.. ఆ దేశంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-26 15:28:18  IST  )

అమెరికా నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఢిల్లీ వచ్చే విమానాన్ని బాంబు బెదిరింపులు.. ఆ దేశంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించి ఇటలీలోని రోమ్‌లో అధికారులు అత్యవసర ల్యాండింగ్ చేశారు. అక్కడ భద్రతా అధికారుల అనుమతి పొందిన తర్వాతే తిరిగి ఢిల్లీకి బయలుదేరనుంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే?

న్యూయర్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి శనివారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన AA 292 విమానం బయలుదేరింది. అయితే, ఈ విమానంలో పేలుడు పరికరాలు ఉన్నాయని సిబ్బందికి నిఘా సమాచారం అందడంతో అంతర్జాతీయ విమానయాన భ్రదతా ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. టర్కీ వరకు వచ్చిన ఆ విమానాన్ని ఇటలీ వాయుసేన విమానం ఆధ్వర్యంలో రోమ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, స్థానిక పోలీసులతో సహా ఇటాలియన్ అధికారులు విమానం వద్ద మోహరించి తనిఖీలు చేపట్టాయి. విమానాన్ని భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్రమాదమేం లేదని చెప్పిన తర్వాతే తిరిగి ఢిల్లీకి బయలుదేరనుంది. ఘటన సమయంలో విమానంలో 280 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే విమానాన్ని రోమ్‌లో ల్యాండ్ చేసినట్లు అమెరికా విమానాయన సంస్థ తెలిపింది.

Next Story