- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులకు పాల్పడుతూ ఈమొయిల్స్, కాల్స్ ఎక్కువయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రముఖ స్కూళ్లలో, విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లుగా తరచూ బెదిరింపులకు పాల్పడుతూ ఈమొయిల్స్ రావటం ఎక్కువయ్యాయి. ఇప్పటికే వీటిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (BSE) భవనానికి బాంబు బెదిరింపు మొయిల్స్ రావటం తీవ్ర కలకలం సృష్టించింది. బీఎస్‌ఈ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు మంగళవారం కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు అమర్చినట్లు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేలుళ్లు సంభవిస్తాయని ఈ మొయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందాలు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని.. నకిలీ బాంబు బెదిరింపు అయి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. మెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు దేశ రాజధానిలోని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లకు, సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఖాళీ చేయించి.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) అధికారిక నివాసానికి సైతం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే.






