ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా వరుసగా హెలికాప్టర్ (Helicopter), విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వరుసగా హెలికాప్టర్ (Helicopter), విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాసేపటి క్రితం ఓ విమానానికి ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొచ్చి (Kochi) నుంచి ఢిల్లీ (Dehli) మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో (Indigo) విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. అయితే, కాల్ వచ్చిన సమయానికి విమానం కొచ్చి నుంచి బయలుదేరింది. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది హుటాహుటిన ఫ్లైట్‌ను దగ్గరలో ఉన్న నాగ్‌పూర్‌‌ ఎయిర్‌పోర్టు‌ (Airport)‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ నుంచి ప్రయాణికులందరినీ దించేసి భద్రతా సిబ్బంది క్షుణంగా తనిఖీలు చేపడుతున్నారు.

Next Story