- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిరిండియా విమానానికి టిష్యూ పేపర్‌లో బాంబు బెదిరింపు సందేశం.. ఏమనంటే?
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Air India plane) ఎయిరిండియా విమానంలో (Bomb threat) బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-3 వద్ద ఉన్న విమానానికి బెదిరింపులు వచ్చాయి. విమానం క్యాబిన్‌లో ‘T3లోని ఎయిర్ ఇండియా 2948లో బాంబు ఉంది’ అనే సందేశంతో కూడిన (tissue paper) టిష్యూ పేపర్‌ను సిబ్బంది కనుగొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ముందస్తు చర్యల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బందని సైతం అలర్ట్ చేశారు.
గంటల తరబడి తనిఖీలు చేపట్టిన తర్వాత విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, టిష్యూ పేపర్‌పై రాసిన వ్యక్తి ఎవరనేది అధికారులు గుర్తించేపనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత.. గత కొన్ని రోజులుగా ఎయిరిండియా విమానాల్లో అనేక సాంకేతిక సమస్యలు రావడంతో.. సంస్థ విమానాల భద్రత, విశ్వసనీయతపై ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. ఇప్పటికే సాంకేతిక కారణాలతో చాలా విమానాలు రద్దు అయ్యాయి.






