- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌లో బాంబుల మోత.. 22 మంది మృతి
by Ajay Maddhiboyina |
పాకిస్తాన్‌లో మూడు చోట్ల బాంబు పేళుళ్లు చోటు చేసుకున్నాయి. వరుస ఘటనల్లో దాదాపు 22 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లో మూడు చోట్ల బాంబు పేళుళ్లు చోటు చేసుకున్నాయి. వరుస ఘటనల్లో దాదాపు 22 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. నైరుతి పాకిస్తాన్‌లో జరిగిన బలూచిస్తాన్ నేషనల్ పార్టీ ర్యాలీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా దాదాపు 40 మందికి గాయాలు అయ్యాయి.
ర్యాలీ నుండి ప్రజలు వెళుతుండగా పార్కింగ్ ప్రాంతంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు బలూచిస్తాన్ ఇరానియన్ బార్డర్ వద్ద దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఘటన ఖైబర్ ఫక్తువా వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు సైనికులు మరణించారు. ఇక ఈ ఘటనకు బలూచిస్తాన్ వేర్పాటు వాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది.
Next Story






