- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bomb Attack : ఆర్మీ కంటోన్మెంట్‌పై బాంబు దాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్(Pakaistan)లోని బన్నూ పట్టణంలో ఆర్మీ కంటోన్మెంట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి(Human Bomb Attack)లో 12 మంది మరణించారు.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్(Pakaistan)లోని బన్నూ పట్టణంలో ఆర్మీ కంటోన్మెంట్‌పై మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి(Human Bomb Attack)లో 12 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరోవైపు ఇతరత్రా జరిగిన ఘటనల్లో పాక్ సైన్యం ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, మంగళవారం సాయంత్రం నమాజు సమయంలో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్ గోడల్ని ఢీ కొట్టడం వల్ల పేలుడు సంభవించింది. ఘటనాస్థలి పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో ఉందని తెలిపారు.
పేలుడు తర్వాత గోడను బద్దలు కొట్టి చాలా మంది ఉగ్రవాదులు కంటోన్మెంట్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, భద్రత దళాలు వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. ఇక పేలుడు ధాటికి కంటోన్మెంట్‌కు సమీపంలో ఉన్న సాధారణ పౌర ఆవాస భవనాల్లో ఐదుగురు మరణించారు. మరో నాలుగు మృతదేహాలను కంటోన్మెంట్‌కు సమీపంలో ధ్వంసమైన మసీదు శిథిలాల నుంచి వెలికి తీశారు. మరోవైపు హాఫిజ్ గుల్ బహాదుర్ నాయకత్వంలోని జైష్ అల్ ఫుర్సాన్ తీవ్రవాద సంస్థ ఈ దాడికి తనదే బాధ్యత అని ప్రకటించింది. ఈ దాడిని ఖైబర్ పఖ్తూంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపుర్ ఖండించారు.






