షూటింగ్ స్పాట్‌లో బాంబు బ్లాస్ట్.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు గాయాలు

by Disha Web Desk 16 |
షూటింగ్ స్పాట్‌లో బాంబు బ్లాస్ట్.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. సంజయ్‌దత్ ప్రస్తుతం ‘కేడీ’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బెంగళూరులోని మాగడి రోడ్డులో జరుగుతోంది. అయితే బాంబ్ బ్లాస్ట్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. బాంబ్ ఒక్కసారిగా బ్లాస్ అయింది. దీంతో సంజయ్ దత్ తలతో పాటు ముఖం, మోచేయిపై గాయాలయ్యాయి. బెంగళూరులో చికిత్స చేయించుకున్న సంజయ్ దత్ అనంతరం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది.

కాగా సంజయ్ దత్ కేజీఎఫ్-2 చాప్టర్‌లో నటించారు. దీంతో ఆయనకు శాండల్‌వుడ్‌లో భారీగా ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా పిరియాడిక్ డ్రామాగా ‘కేడీ’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తుండగా స్టంట్ డైరెక్టర్ రవివర్మ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే దురదృష్టకర సంఘటన జరగడంతో షూటింగ్ వెంటనే ఆగిపోయింది. సంజయ్ దత్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది

ఇవి కూడా చదవండి: లియో’లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ?



Next Story

Most Viewed