- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Khan: ‘కారును బాంబుతో పేల్చేస్తాం’ సల్మాన్ఖాన్కు మరోసారి బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సోమవారం ముంబాయి వర్లీ ప్రాంతంలోని రవాణా శాఖ కార్యాలయానికి అధికారిక నంబర్‌కు వాట్సాప్ ద్వారా హత్య బెదిరింపు వచ్చింది. అతని ఇంట్లోకి బొరబడి చంపేస్తామని, సల్మాన్‌ఖాన్ కారులో బాంబు పెట్టి పేల్చివేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వర్లి పోలీస్ స్టేషన్‌లో సందేశం పంపిన గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత కొన్ని ఏళ్లుగా సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
(blackbuck) కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో పలుమార్లు (Lawrence Bishnoi gang) బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖాన్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ గతంలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. 2024లో ఖాన్‌కు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే కృష్ణ జింకల విషయంలో గుడి సందర్శించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా రూ.5 కోట్లు చెల్లించాలని గతంలో డిమాండ్ చేశారు. తాాజాగా వచ్చిన బెదిరింపులు బిష్ణోయ్ గ్యాంగ్ చేసిందా? లేదా ఇతర కారణాల కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






