- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గా పనికి రాడు
షమ మహ్మద్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం మాత్రమే. వాటికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని అన్నారు. రోహిత్ చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతడో గ్రేట్ ప్లేయర్.. జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడని రాజీవ్ శుక్లా చెప్పారు.

- కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహ్మద్ వ్యాఖ్యలు
- మద్దతు పలికిన టీఎంసీ లీడర్ సుగతా రాయ్
- కాంగ్రెస్, టీఎంసీపై బీజేపీ మంత్రి నిప్పులు
దిశ, నేషనల్ బ్యూరో: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 'రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు. ఒక క్రీడాకారుడు అలా ఉండకూడదు. ఆయన వెంటనే బరువు తగ్గాలి. ఇప్పటి వరకు ఆకర్షనీయంగా కనపడని ఏకైక భారత కెప్టెన్ రోహిత్ శర్మ' అంటూ షమ మహ్మద్ తన సోషల్ మీడియా ఖాతాలో సంచనల పోస్టు పెట్టారు. అయితే షమ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుగతా రాయ్ మద్దతు పలికారు. రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పని కాడని, కనీసం జట్టులో స్థానానికి కూడా అర్హుడు కాదని తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, క్రీడా వర్గాల్లో దుమారం చేపాయి. వెంటనే ఆ పోస్టును డిలీట్ చేయాలంటూ షమకు వార్నింగ్స్ కూడా వచ్చాయి. కాగా.. ఈ విషయంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవియా స్పందించారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన కాంగ్రెస్, టీఎంసీ పార్టీలపై నిప్పులు చెరిగారు.
'కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు క్రీడాకారులను ఒంటరిగా వదిలేయారు. వాళ్లు తమ వృత్తి జీవితాల్లో అత్యంత సమర్థులు. ఒక క్రీడాకారుడి మీద ఈ రాజకీయ పార్టీలు బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. జట్టులో స్థానాన్ని కూడా ప్రశ్నించడం అత్యంత దారుణమైన విషయం' అని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వల్ల వారు దేశం కోసం చేసిన కృషి, త్యాగాలను తక్కువగా చేస్తాయని చెప్పారు. ప్రపంచకప్ గెలిచిన నాయకుడిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేత రాధికా ఖేరా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా క్రీడాకారులను అవమానపరుస్తుందని రాధికా ఖేరా అన్నారు. అయితే షమ మహ్మద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. టీఎంసీ ఇంకా స్పందించలేదు. అయితే, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా స్పందించారు. షమ మహ్మద్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం మాత్రమే. వాటికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని అన్నారు. రోహిత్ చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతడో గ్రేట్ ప్లేయర్.. జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడని రాజీవ్ శుక్లా చెప్పారు.






