- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
J&K: జమ్ముకశ్మీర్ లో తప్పిపోయిన ముగ్గురి కథ విషాదాంతం
జమ్ముకశ్మీర్‌లో తప్పిపోయిన ముగ్గురి కథ విషాదంగా మారింది. కథువా జిల్లాలోని బిల్లావర్ లో వారి ముగ్గురి డెడ్ బాడీలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో తప్పిపోయిన ముగ్గురి కథ విషాదంగా మారింది. కథువా జిల్లాలోని బిల్లావర్ లో వారి ముగ్గురి డెడ్ బాడీలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. రెండ్రోజులుగా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. భద్రతాదళాలు శనివారం ఆ ముగ్గురి మృతదేహాలను గుర్తించాయి. బుధవారం ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా వారు మిస్సయ్యారు. అయితే, దారి తప్పిపోయినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేయడంతో మిస్సింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన వారు ప్రమాదంలో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం తర్వాతే మరణానికి గల కారణాలపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ముగ్గురు అదృశ్యమైన తర్వాత భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. శనివారం డెడ్ బాడీని గుర్తించాయి.
ఉగ్రచర్య అని అనుమానం
మరోవైపు, ఇది ఉగ్రవాదుల చర్య కావచ్చని కూడా సందేహిస్తున్నారు. ఉగ్రకోణంలోనూ ఈ కేసుని దర్యాప్తు చేయనున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు కన్పించారని స్థానికులు చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) చేసిన పోస్ట్ పౌరులను కిడ్నాప్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.






