- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఎంసీ కీలక నిర్ణయం.. బక్రీద్ కుర్బానీ అనుమతి రద్దు
ముంబైలోని గోరేగావ్ హౌసింగ్ సొసైటీ ఆవరణలో బక్రీద్ కుర్బానీ నిర్వహించుకోవడానికి ఇచ్చిన పర్మీషన్‌ను బృహన్ ముంబై మహానగరపాలిక రద్దు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: బృహన్ ముంబై మహానగరపాలిక (BMC) పరిపాలనా విభాగం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలోని ఓ హౌసింగ్ సొసైటీ ఆవరణలో బక్రీద్ పండుగ సందర్భంగా జంతు బలులు ఇవ్వడానికి గతంలో ఇచ్చిన అనుమతిని మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. అయితే, గోకుల్‌ధామ్‌లోని ఆరే భాస్కర్ రోడ్‌లో గల ‘శాటిలైట్ గార్డెన్ ఫేజ్-2, ఆజాద్ నగర్ డీ-3, సి-వింగ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ ఆవరణలో బక్రీద్ కుర్బానీ నిర్వహించుకోవడానికి పి-దక్షిణ్ వార్డు కార్యాలయం గతంలో అనుమతి ఇచ్చింది. కానీ, బృహన్ ముంబై పరిధిలో బక్రీద్ కొరకు మతపరమైన జంతు బలుల కోసం ప్రత్యేకంగా 15 అధికారిక ప్రాంతాల జాబితాను బీఎంసీ విడుదల చేసింది. ఈ హౌసింగ్ సొసైటీకి కేవలం 1 కి.మీ పరిధిలోనే, మలాడ్ (ఈస్ట్) ఖడక్‌పాడా ఫిల్మ్‌సిటీ రోడ్‌లో సొసైటీకి సమీపంలోనే ప్రభుత్వం గుర్తించిన అధికారిక వధశాల కేంద్రం అందుబాటులో ఉండటంతో... నిబంధనల ప్రకారం హౌసింగ్ సొసైటీ ఆవరణలో కుర్బానీ చేసుకోవడానికి ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు బీఎంసీ (BMC) అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.






