రాహుల్ గాంధీ పెళ్లిపై బీజేపీ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాహుల్ గాంధీ పెళ్లిపై బీజేపీ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ పెళ్లిపై బీజేపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి ప్రస్తావన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బిహార్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మోడీ(PM Modi)ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే(Mallikarjun Kharge) విమర్శించారు. తన కొడుకు పెళ్లి అన్నట్లుగా బిహార్‌లో ప్రధాని మోడీ తిరుగుతున్నారని ఖర్గే కామెంట్ చేశారు. దీనిపై తాజాగా బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ దిగజారుడుతనమని మండిపడింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసింది. 'ఖర్గేజీ మీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్) పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం కచ్చితంగా హాజరవుతాం' అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా, బిహార్‌లో నవంబరు 6న తొలిదశ పోలింగ్‌ జరగనుంది. మొదటివిడతకు మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలోనే నేతల ప్రచార జోరు హోరందుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే గెలవదని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాకు తెలుసని, అందుకే ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని అంతకుముందు రాహుల్ గాంధీ ఆరోపించారు.

Next Story