- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP: భారత్ను అవమానిస్తే ఓట్లు పడవు.. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతోందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆయన కొలంబియా ప్రర్యటనలో ఉన్న ఆయన తాజాగా అక్కడి ఈఐఏ యూనివర్సిటీలో (EIA University) ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ చోటు కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ దాడిని ఎదుర్కొంటోందన్నారుు. అలాగే చైనాకు భారత్ పొరుగు దేశం. అమెరికాకు మిత్ర దేశం అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ మోటార్ వైపు మళ్లుతోంది. పోటీ అమెరికా చైనా మధ్య ఉంది. ఈ విషయంలో చైనానే ముందుందన్నారు. చైనాకు భారత్ పొరుగు దేశం, అమెరికు మతిర్ దేశం ఈ రెండు దేశాలు పోటీలో ఉంటే మేము మధ్యలో ఉన్నామన్నారు. భారత్ లో ఆర్థిక వృద్ధి ఉంది. కానీ ఉత్పత్తి భారీ స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో లేదన్నారు. చైనా అప్రజాస్వామిక వాతావరణంలో ఉత్పత్తి చేస్తోందన్నారు
భారత్ ను అవమానిస్తే ఓట్లు పడవు:
భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రధానమంత్రి మోడీని, దేశ అభివృద్ధిని అత్యధికంగా దూషించేది రాహుల్ గాంధీనే అని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానిస్తే ప్రజలు నీకు ఓటు వేయరు అని కౌంటర్ ఇచ్చారు. ఈసారి నువ్వు గతంలో వచ్చినన్ని సీట్లు కూడా మీరు గెలవలేరని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పుడు చైనాను పొగుడుతున్నారు. భారత్ ఒక ప్రధాన గ్లోబల్ పవర్ కాలేదని, చైనా ప్రపంచాన్ని నడిపించగలదని మాట్లాడుతున్నారు. కానీ నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. రాహుల్ గాంధీకి చైనా మీద ప్రేమ మరోసారి స్పష్టంగా బయటపడిందని భారత్‌ను అవమానించడానికి ఆయన ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోవడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.






