- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FLASH: గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. రికార్డు స్థాయిలో మెజార్జీ వచ్చే చాన్స్!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 92 సీట్లు సాధించాల్సి ఉండగా.. ప్రస్తుతం బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో గతంలో కంటే గుజరాత్‌లో బీజేపీకి భారీ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. నాడు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 77 స్థానాల్లో గెలిచింది. గత రికార్డలన్నీ తిరగరాస్తూ.. ఈసారి గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమైంది. మొత్తం 182 స్థానాల్లో 150కి పైగా స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉంది. గతంలో 77 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి దారుణంగా విఫలమైనట్లు కనిపిస్తోంది. కేవలం 18 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. మరోసారి సొంతరాష్ట్రంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పట్టునిలుపుకున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యారు.
Read more:






