తిరువనంతపురం మేయర్‌గా మాజీ డీజీపీ? బీజేపీ ప్లాన్ అదే!

by Phanindra |

తిరువనంతపురం మేయర్‌గా మాజీ డీజీపీ ఆర్. శ్రీలేఖను నియమించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

తిరువనంతపురం మేయర్‌గా మాజీ డీజీపీ? బీజేపీ ప్లాన్ అదే!
X

దిశ, నేషనల్ బ్యూరో: తిరువనంతపురంలో 45 ఏళ్లపాటు ఉన్న లెఫ్ట్ పాలనను బీజేపీ ముగించింది. ఈ కార్పొరేషన్ గెలుచుకున్న బీజేపీ.. కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఆర్ శ్రీలేఖను మేయర్‌గా నిలబెట్టాలనుకుంటోందని సమాచారం. 2020లో డీజీపీగా రిటైర్ అయిన ఆమె.. సస్తమంగళం డివిజన్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె విజయంతో ఇక తిరువనంతపురం మేయర్‌గా ఆమెకే బీజేపీ అవకాశం ఇస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా ఆ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆమెను మేయర్‌గా నియమిస్తే.. రాష్ట్ర రాజధానిలో బీజేపీ తొలి మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

Next Story