- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
BJP vs Congress: రసాభాసగా చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్

దిశ, నేషనల్ బ్యూరో : చండీగఢ్(Chandigarh) మున్సిపల్ కార్పోరేషన్ మీటింగ్ లో రసాభాసగా మారింది. రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్(Dr BR Ambedkar) పై కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో వివాదం తలెత్తింది. దీనిపైనే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు (Chandigarh Municipal Corporation) కొట్లాడుకున్నారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్‌లు తప్పుపట్టారు. ఈ మేరకు అమిత్ షాకు వ్యతిరేకంగా కార్పోరేషన్‌లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానికి ఆమోదముద్ర వేయించుకున్నారు. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు. దాంతో ఈ తీర్మానంపై ఓటింగ్‌కు పోల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన అనిల్ మాషీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాహుల్‌గాంధీపై ఉన్న ఇండియా హెరాల్డ్ కేసు గురించి ప్రస్తావించారు. దీంతో, కార్పోరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గొడవకు దారితీసింది. ఇరు పార్టీల సభ్యులు బాహాబాహీకి దిగారు.
కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు
ఇకపోతే, కాంగ్రెస్ హయాంలోనే అంబేడ్కర్‌కు అవమానం జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు అన్నారు. భారత ప్రధాని నెహ్రూ హయాంలోనే అంబేడ్కర్‌ను అవమానించారని ఆరోపించారు. దాంతో కాంగ్రెస్ కౌన్సిలర్‌లు బీజేపీపై మండిపడ్డారు. రెండు పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు బాహాబాహీగా దిగడంతో గందరగోళం నెలకొంది. అంబేడ్కర్‌ను అవమానించారని అన్నందుకు కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఆయన పేరుని వాడుంకుందని మండిపడింది.