- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
బెంగళూరు: బీజేపీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాషాయ పార్టీ మాజీ సీఎం యడియూరప్పను టిష్యూ కాగితంలా ఉపయోగిస్తుందని వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసే సమావేశానికి మాజీ సీఎంను దూరంగా ఉంచడం చూస్తే ఈ విషయం అర్థమవుతుందని తెలిపింది. సీనియర్ లింగాయత్ నేతకు ఇది తీవ్రమైన అవమానమని కాంగ్రెస్ ఆరోపించింది.
యడియూరప్పను తప్పించి ఇతర రాష్ట్రాల నేతలకు సమావేశంలో చోటు కల్పించడం దారుణమని పేర్కొంది. కర్ణాటకలో కాషాయ పార్టీని నిర్మించిన నేతకు సమావేశానికి పక్కకు పెట్టారని విమర్శించింది. ఆయనకు అభ్యర్థులను ఎంపిక చేసే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించింది. అయితే తాను ఇచ్చిన సలహాలకు పార్టీ ఆమోదం తెలిపిందని యడియూరప్ప చెప్పిన సంగతి తెలిసిందే.
Next Story






