- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు హైకమాండ్ కాదా?.. ఖర్గేపై బీజేపీ సెటైర్లు!
కర్ణాటకలో సీఎం మార్పు అంశం హైకమాండ్ చేతిలో ఉందన్న మల్లికార్జున ఖర్గే. మీరు హైకమాండ్ కాదా? అంటూ బీజేపీ సెటైర్లు!

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై ప్రశ్నలు ఎదురైనప్పుడు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్చున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉందని, హైకమాండ్‌లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఖర్గే అన్నారు. ‘ఈ డెసిషన్‌ను హైకమాండ్‌కు వదిలిపెట్టాం. వాళ్లే ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటారు. ఎవరూ ఈ విషయంపై అనవసరమైన సమస్యలు సృష్టించొద్దు’ అని ఖర్గే స్పష్టంచేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో తను పార్టీ హైకమాండ్ కాదనే సంకేతాలను ఆయన ఇచ్చినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ మరోసారి కాంగ్రెస్, ఖర్గేను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తోంది.
కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇదే విషయంపై స్పందిస్తూ.. అసలు ఈ హైకమాండ్ ఎవరని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ హైకమాండ్ ఒక భూతం లాంటిది. ఎవరికీ కనిపించదు, వినిపించదు. కానీ అందరికీ తెలుస్తుంటుంది. ఇంతకాలం ప్రజలంతా హైకమాండ్ అనుకున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా అదే చెప్తున్నారు. తను హైకమాండ్ కాదంటున్నారు’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. కర్ణాటక అసెంబ్లీలో విపక్ష నేత ఆర్ అశోక కూడా ఖర్గేపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ మరోసారి ‘యాక్సిడెంటల్’ నేతను దేశానికి అందించిందంటూ చురకలేశారు. ‘అప్పట్లో మన్మోహన్ సింగ్‌కు కుర్చీ ఉన్నా.. అధికారం ఉండేది కాదు. ఇప్పుడు ‘యాక్సిడెంట్’ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పరిస్థితి కూడా అదే. పార్టీ ప్రెసిడెంట్ అయినా గర్వంగా హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తనకు తెలియదని అనడం విడ్డూరంగా ఉంది. ఖర్గే గారూ.. మీరు హైకమాండ్ కాకపోతే ఎవరు? రాహుల్ గాంధీనా? సోనియా గాంధీనా? ప్రియాంక గాంధీనా? లేదంటే ఒకే ఇంటిపేరుకు చెందిన కనిపించని కమిటీనా?’ అని అశోక విమర్శించారు.






