ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

by Ajay Maddhiboyina |

ఉగ్ర‌దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నిఘావ‌ర్గాల స‌మాచారం ఉంద‌ని, అందువ‌ల్లే మోడీ త‌న క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నార‌ని ఖ‌ర్గే వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్ర‌దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నిఘావ‌ర్గాల స‌మాచారం ఉంద‌ని, అందువ‌ల్లే మోడీ త‌న క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నార‌ని ఖ‌ర్గే వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ముందే స‌మాచారం ఉన్నా దాడిని ఆప‌డంలో విష‌లం అయ్యార‌ని ఆరోపించారు. నిఘా వైఫల్యం ఉంద‌ని కేంద్రం కూడా అంగీక‌రించింద‌న్నారు. ఏదేమైనా పాకిస్థాన్ పై దాడి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని స్పష్టం చేశారు.

ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్ ఇస్తోంది. బీజేపీ అధికార ప్ర‌తినిధి తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు లేవ‌ని అన్నారు. పాకిస్థాన్ పై దాడి విష‌యంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని చెబుతూనే మ‌రోవైపు దేశాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం అని బీజేపీ సీనియ‌ర్ నేత ర‌విశంక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story