- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BJP : బీజేపీ దూకుడు... ఏకంగా 21 రాష్ట్రాల్లో జెండా పాతిన కమలం

దిశ, వెబ్ డెస్క్ : భారత్లో బీజేపీ(BJP) దూసుకుపోతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) కూడా బీజేపీ గెలిచి 21 రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, హర్యానా, గుజరాత్, గోవా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి బీజేపీ చేజిక్కించుకోగా.. తాజాగా ఆ జాబితాలో ఢిల్లీ వచ్చి చేరింది. ఇలా మొత్తం బీజేపీ, మిత్ర రాష్ట్రాలు కలిసి 21 రాష్ట్రాలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి.
ఇక దేశంలో కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో బీహార్, హిమాచల్ ప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాగా వేస్తామని బీజేపీ అంటోంది. అందుకు అనుగుణంగా ఇటీవలి కేంద్ర బడ్జెట్(Central Budget) లో బీహార్ కు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ధార బోసింది. తమిళనాడు, కేరళ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్లో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో కూడా తమ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు ఆ పార్టీ నేతలు.