మహారాష్ట్రలో బీజేపీ పాలన దారుణం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-03-14 15:12:47  IST  )

మారాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్తుడు, తతారా ఎంపీ ఉదయన్‌రాజే భోస్లే.. ఔరంగజేబు సమాధాని తొలగించాలని కోరారు.

మహారాష్ట్రలో బీజేపీ పాలన దారుణం
X

- ఔరంగజేబు పాలన కంటే ఘోరం

- రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయి

- శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వ పాలన అత్యంత దారుణంగా ఉందని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అప్పట్లో ఔరంగజేబు పాలన కంటే బీజేపీ పాలన అత్యంత ఘోరంగా ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ పాలన కారణంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రౌత్ అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళల ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరిగిపోయాయని.. ఇందుకు ఔరంగజేబు కారణమని బీజేపీ భావిస్తోందా అని రౌత్ విమర్శించారు. ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఔరంగజేబు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాగా, మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో బీజేపీతో పాటు శివసేన, ఎన్సీపీ భాగస్వాములుగా ఉన్నాయి.

మారాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్తుడు, తతారా ఎంపీ ఉదయన్‌రాజే భోస్లే.. ఔరంగజేబు సమాధాని తొలగించాలని కోరారు. దీనిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ సమాధిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలోకి తీసుకొని వచ్చినట్లు చెప్పారు. అందరూ సమాధిని తొలగించాలని కోరుతున్నా.. అదంత సులభంగా కూల్చలేమని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలను సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఔరంగజేబు కాదు.. మీ బీజేపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు.

READ MORE ....

మోడీ, ట్రంప్‌లది గొప్ప లక్ష్యం


Next Story