- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock Drill: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. బీజేపీ కీలక విజ్ఞప్తి
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో.. రేపు (మే7) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో.. రేపు (మే7) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఏయే రాష్ట్రాల్లో ఏయే జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేపడుతారో లిస్ట్ కూడా రెడీ చేసింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రజలను ఉద్దేశించి X వేదికగా ఒక పోస్ట్ చేసింది. మాక్ డ్రిల్‌లో ప్రజలు, విద్యార్థులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై చేపడుతున్న మాక్ డ్రిల్‌లో అందరూ పాల్గొనాలని కోరింది.
వైమానిక దాడుల హెచ్చరిక సైరన్‌లను మోగించడం, శత్రుదాడుల సమయంలో పౌరులు, విద్యార్థులకు స్వీయ రక్షణలో శిక్షణ ఇవ్వడం, క్రాష్ బ్లాక్ అవుట్ చర్యలను అమలు చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాలను ముందస్తుగా మభ్యపెట్టడం ప్రారంభించడం, యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రణాళికలను నవీకరించడం, రిహార్సల్ చేయడం ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశాలని పేర్కొంది.






