- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ ప్రకటన పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కౌంటర్
పార్లమెంట్‌లో వందేమాతరం, ఎస్ఐఆర్, ఓట్ చోరి అంశాలపై బుధవారం హాట్ హాట్ గా డిస్కషన్ నడిచింది.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో వందేమాతరం, ఎస్ఐఆర్, ఓట్ చోరి అంశాలపై బుధవారం హాట్ హాట్ గా డిస్కషన్ నడిచింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలపై ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన మూడు అంశాలకు హోంమంత్రి బాగా సమాధానం ఇచ్చారని, దానికి రాహుల్ వద్ద ఎలాంటి జవాబు లేదని దూబే అన్నారు. "అందుకే ప్రజలు గానీ, దేశం గానీ రాహుల్ గాంధీ ప్రకటనలను సీరియస్‌గా తీసుకోరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసలు తీసుకోరు" అని నిషికాంత్ దూబే పేర్కొన్నారు.
ముఖ్యంగా, హోంమంత్రి అమిత్ షా అక్రమ వలసలు (illegal immigration) అనే అంశంపై మాట్లాడటం ప్రారంభించగానే, రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారని దూబే తెలిపారు. "గౌరవనీయులైన హోంమంత్రి చెబుతున్న పాయింట్లపై రాహుల్ గాంధీ సమర్థవంతంగా అంగీకారం తెలిపినట్లే, అందుకే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని దూబే మీడియాతో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నిన్నటి సమావేశంలో అక్రమ వలసలపై అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ సహా, ఇండియా కూటమి నేతలో సభ నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రవర్తన పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి రాహుల్ గాంధీ ఇలా మధ్యలో వెళ్లిపోవడం ఎంటని ప్రశ్నిస్తున్నారు.






