- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎంపీపై దాడి..తలకు తీవ్రగాయాలు
పశ్చిమబెంగాల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ముపై దాడి జరిగింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జలైపురి ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ముపై దాడి జరిగింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జల్పైగురి ప్రాంతంలో ఆయన పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ కార్యకర్తలతో కలిసి సామాగ్రి పంపిణీ చేస్తుండగా ఖాగెన్ పై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో ఖాగెన్ ముర్ము తలకు తీవ్రగాయాలయ్యాయి.
రక్తంతో ఆయన ముఖం తడిచిపోయింది. వెంటనే బీజేపీ నేతలు ఎంపీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల పనే అని ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడితో తమకు సంబంధం లేదని దాడి చేసినవాళ్లు టీఎంసీ జెండాలు పట్టుకోలేదని తృణమూల్ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ప్రజలు తిరుగుబాటు చేసేలా రెచ్చగొడుతున్నారని, ఇప్పుడు వాళ్లపైనే తిరుగుబాటు మొదలైందని చెబుతున్నారు.






