ఎస్ సార్, ఎస్ మేడం అనొద్దు జైశ్రీరామ్ అనాలి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ర్ణాట‌క బీజేపీ ఎమ్మెల్యే గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్కూల్ లో అటెండెన్స్ స‌మ‌యంలో విద్యార్థులు త‌మ పేరు పిలిచిన‌ప్పుడు ఎస్ సార్.. ఎస్ మేడ‌మ్ అని చెప్ప‌డానికి బ‌దులుగా జై శ్రీరామ్ అనాల‌ని సూచించారు.

ఎస్ సార్, ఎస్ మేడం అనొద్దు జైశ్రీరామ్ అనాలి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్ణాట‌క బీజేపీ ఎమ్మెల్యే గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్కూల్ లో అటెండెన్స్ స‌మ‌యంలో విద్యార్థులు త‌మ పేరు పిలిచిన‌ప్పుడు ఎస్ సార్.. ఎస్ మేడ‌మ్ అని చెప్ప‌డానికి బ‌దులుగా జై శ్రీరామ్ అనాల‌ని సూచించారు. గ‌తంలో ఇదే ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చిన మ‌రో బీజేపీ ఎమ్మెల్యే బ‌స‌న‌గౌడ పాటిల్ య‌త్నాల్ కు తాను పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నట్టు గాలి మీడియా స‌మావేశంలో చెప్పారు. తాను ఏ స్కూల్ కు, కాలేజీకి వెళ్లినా యాజ‌మాన్యానికి ఇదే సూచిస్తాన‌ని అన్నారు.

స్కూల్ లో విద్యార్థినులు హిజాబ్ ధ‌రించ‌డం, ఇత‌ర మ‌త చిహ్నాల‌ను ధ‌రించ‌డాన్ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఇటీవ‌లే అన‌మ‌తించ‌గా ఇప్పుడు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి చేసిన కామెంట్లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. గాలి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో కొంత‌మంది స‌పోర్ట్ చేస్తుంటే మ‌రికొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. స్కూల్ అన్న‌త‌ర‌వాత అన్ని మ‌తాల వారు ఉంటార‌ని కాబ‌ట్టి ఒక మ‌తానికి సంబంధించిన దేవుడి పేరును ఇత‌ర మ‌తాల విద్యార్థులు ఎందుకు చెబుతార‌నే ప్రశ్న‌లు వినిపిస్తున్నాయి. ఇది హిందూ దేశం కాబ‌ట్టి జైశ్రీరామ్ అంటే త‌ప్పేంటి అని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో గాలి చేసిన వ్యాఖ్య‌లు క‌ర్ణాట‌క‌లో హాట్ టాపిక్ గా మారాయి.

Next Story