మీ మాటలన్నీ నాకు తెలుస్తాయి.. పార్టీ కార్యకర్తలకు బీజేపీ మంత్రి హెచ్చరిక

by Phanindra |

మీ మాటలన్నీ నాకు తెలుస్తాయంటూ పార్టీ కార్యకర్తలకు బీజేపీ మంత్రి హెచ్చరిక చేశారు. దీంతో అక్రమ సర్వయిలెన్స్ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మీ మాటలన్నీ నాకు తెలుస్తాయి.. పార్టీ కార్యకర్తలకు బీజేపీ మంత్రి హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రశేఖర్ బవాంకులే షాకింగ్ కామెంట్స్ చేశారు. దీపావళి సందర్భంగా పార్టీ నేతలు, వర్కర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరిపై సర్వయిలెన్స్ ఉందన్న ఆయన.. వారి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ అన్నింటిపై పర్యవేక్షణ ఉందని చెప్పారు. ‘మీరు మాట్లాడే ప్రతి మాట పర్యవేక్షణలోనే ఉంది. ఒక్క తప్పుడు బటన్ నొక్కినా వచ్చే ఐదేళ్ల పార్టీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది’ అని కార్యకర్తలను హెచ్చరించారు. దీంతో ప్రజలపై ప్రభుత్వ పర్యవేక్షణపై పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఇది అక్రమ పర్యవేక్షణ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే దీనిపై వివరణనిచ్చిన బవాంకులే.. తాను వాట్సాప్ గ్రూప్స్, పార్టీకి సంబంధించిన మెసేజ్‌ల గురించి మాట్లాడానని అన్నారు.

Next Story