- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైష్ణోదేవీ వర్సిటీలో హిందువులకే సీట్లు ఇవ్వాలి.. జమ్ము- కాశ్మీర్ సీఎంకు బీజేపీ లేఖ
శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో హిందూయేతరులకు సీట్లు ఇవ్వడంపై బీజేపీ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖలో యూనివర్సిటీలో 42మంది ముస్లిం విద్యార్థులకు అడ్మిషన్స్ నిలిపివేవేయాలని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో హిందూయేతరులకు సీట్లు ఇవ్వడంపై బీజేపీ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖలో యూనివర్సిటీలో 42మంది ముస్లిం విద్యార్థులకు అడ్మిషన్స్ నిలిపివేవేయాలని పేర్కొంది. నీట్ యూజీ పరీక్షల్లో క్వాలిఫై అయిన ఇతర మతానికి చెందిన విద్యార్థులు ఆ యూనివర్సిటిలో చేరడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీ మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయ చట్టాన్ని సవరించాలని కోరింది. తద్వారా దేవతపై విశ్వాసం ఉన్న విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందుతారని పేర్కొంది.
అంతే కాకుండా ముఖ్యమంత్రి దేశవ్యతిరేక భావాలు కలిగి ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. వర్గాల మధ్య విభజనలను సృష్టించడం ద్వారా అడ్మిషన్ల అంశాన్ని రాజకీయం చేసి కించపరుస్తున్నారని ఆరోపించింది. ఇదిలా ఉంటే ఇటీవల విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ కోర్సులో తొలి బ్యాచ్ లో 50 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా అందులో 42మంది ముస్లింలు ఉన్నారు. ఏడుగురు హిందూ, ఒక సిక్కు విద్యార్థి ఉన్నట్టు సమాచారం. మరోవైపు యూనివర్సిటీలో సీట్లను కేవలం హిందువులకే కేటాయించాలని బీజేపీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు.






