- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఢిల్లీలో 68 చోట్ల పోటీ చేయనున్న బీజేపీ

- మిత్ర పక్షాల కోసం 2 సీట్లు కేటాయింపు
- నాలుగో లిస్టు విడుదల చేసిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా.. రెండు సీట్లను మిత్ర పక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీకి కేటాయించింది. బీజేపీ గురువారం 9 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో లిస్టును విడుదల చేసింది. దీంతో మొత్తం 68 మంది అభ్యర్థులు పూర్తయ్యారు. 'సీట్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీకి చెరో సీటును కేటాయించాము. జేడీయూ బురారీ సీటు నుంచి, ఎల్‌జేపీ దియోలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాయి'అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. బురారీ నుంచి శైలేంద్ర కుమార్‌ను బరిలోకి దింపనున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఎల్‌జేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. బీహార్‌లో ఈ ఏడాది ఎన్నికలు ఉండటం వల్లే.. బీహారీ పార్టీలకు చెరో సీటు కేటాయించినట్లు చర్చ జరుగుతోంది. కాగా, ఎన్డీయేలో భాగస్వామి అయిన శివసేన శిండే పార్టీకి సీటు కేటాయించలేదు. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీతో శివసేన చర్చలు జరిపింది. అయినా శివసేనకు ఢిల్లీలో కలిసి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. మరోవైపు ఎన్డీయేలోనే ఉన్న అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 11 మంది అభ్యర్థులను రంగంలోకి దింపింది.