- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: కారులో బీజేపీ లీడర్ రాసలీలలు.. ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు
రాసలీలలు కొనసాగిస్తున్న బీజేపీ లీడర్ ను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకులు మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తూ స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. కారులోనే పాడు పని చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అవాక్కనై ఆ నేత తమను వదిలిపెట్టాలని కాళ్లబేరానికి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో బీజేపీ పార్టీకి చెందిన నాయకుడు రాహుల్ బాల్మికి ఓ వివాహిత మహిళను కారులో తీసుకుని స్థానికంగా ఉండే ఓ శ్మశానం వద్దకు వెళ్లాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొంత మంది స్థానికులకు ఆ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో దగ్గరకు వెళ్లి చూడగా ఆ కారులో రాహుల్ బార్మికి కారులో ఉన్న మహిళతో అభ్యంతరకమైన స్థితిలో ఉన్నారు. దాంతో కారులో నుండి బయటకు రావాలని స్థానికులు కోరగా వారు బయటకు వచ్చి తమను వదిలేయాలంటూ కాళ్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బీజేపీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫ్రంట్ బాధ్యతలను రాహుల్ చూస్తున్న్టలు తెలుస్తోంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నుంచి రాహుల్ పరారీలో ఉన్నట్లు సమచారం.
కాగా ఇటీవల మధ్యప్రదేశ్ బీజేపీకి చెందిన నాయకుడు మనోహర్ లాల్ ధాకడ్ శృంగార లీలలు ఇంటర్నెట్ లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ లీడర్ గత మే లో ఢిల్లీ-ముంబయి 8 లేన్ ఎక్స్ ప్రెస్ వేపై మార్గమధ్యలో కారు ఆపి ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ ఘటన మరువక ముందే యూపీలో మరో బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం కలకలం రేపింది.






