- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో సంచలనం.. జీప్‌తో తొక్కించి రైతును చంపిన బీజేపీ నేత.. అడ్డుకున్న కూతురిపై కూర్చుని.. అసభ్యకరంగా
మధ్యప్రదేశ్ గుణా జిల్లా గణేష్‌పురలో దారుణ ఘటన జరిగింది. బీజేపీ నేత మహేంద్ర నగర్, అతని అనుచరులతో కలిసి రామ్ స్వరూప్ అనే రైతుపై దాడికి దిగాడు. భూమి విషయంలో వివాదం తలెత్తగా..

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ గుణా జిల్లా గణేష్‌పురలో దారుణ ఘటన జరిగింది. బీజేపీ నేత మహేంద్ర నగర్, అతని అనుచరులతో కలిసి రామ్ స్వరూప్ అనే రైతుపై దాడికి దిగాడు. భూమి విషయంలో వివాదం తలెత్తగా.. అతన్ని రాడ్లతో కొట్టి, థార్ జీప్‌తో తొక్కించి.. తీవ్రంగా గాయపరిచాడు. దీంతో రామ్ స్వరూప్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.
నిజానికి మహేంద్ర నగర్ చిన్న రైతుల భూములను భయపెట్టించి కొట్టేసేందుకు చూస్తాడని తెలిపారు స్థానికులు. కానీ రామ్ స్వరూప్, అతని కుటుంబం ఈ బెదిరింపులకు భయపడలేదని, దీంతో మహేంద్ర నగర్ ఇంతకు తెగించాడని చెప్తున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన బాధితుడి భార్య, ఇద్దరు పిల్లలను కూడా కొట్టారని.. మహేంద్ర సింగ్ కుమార్తెపై కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, బట్టలు చింపేశాడని తెలిపారు. కాగా దీనిపై రామ్ స్వరూప్ పదిహేడేళ్ల కూతురు వీడియో రిలీజ్ చేసింది. ‘నేను నాన్నను కాపాడాలని వెళ్లినప్పుడు.. ఆయన నా మీద కూర్చుని.. కొట్టి.. దుస్తులు చింపేశాడు. తుపాకులతో బెదిరించారు’ అని తెలిపింది.






