ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నాయకుడి కిడ్నాప్

by Dishanational4 |
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నాయకుడి కిడ్నాప్
X

దిశ, నేషనల్ బ్యూరో : అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నాయకుడిని మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఓ లోక్‌సభ అభ్యర్థి పురమాయించడం వల్లే సదరు బీజేపీ నాయకుడిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ నాయకుడిని మిలిటెంట్ల చెర నుంచి విడిపించేందుకు పోలీసులు, పారామిలిటరీ బలగాలతో కూడిన ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఈవివరాలను అరుణాచల్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్) చుకు అపా ధ్రువీకరించారు. దీనిపై అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం స్పందించింది. మిలిటెంట్ల వల్ల ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టామని ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) పవన్ కుమార్ సైన్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించి.. మిలిటెంట్ల ఆగడాలకు తావులేని సురక్షిత వాతావరణాన్ని క్రియేట్ చేశామని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలోని మొత్తం 2,226 పోలింగ్‌ కేంద్రాలకుగానూ 228 చోట్లకు వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆయా రూట్లలో నేటికీ రోడ్లు సరిగ్గా లేవు.

Next Story

Most Viewed