బీజేపీ ఏ ఒక్క హమీనీ నెరవేర్చలేదు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by samatah |
బీజేపీ ఏ ఒక్క హమీనీ నెరవేర్చలేదు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. బీజేపీ గతంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, భవిష్యత్‌లోనూ నెరవేర్చబోదని ఎద్దేవా చేశారు. గతంలో తాము ఇచ్చిన హామీలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మడికేరిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రతి బ్యాంకు ఖాతాదారునికి రూ. 15లక్షలు ఇస్తానన్ని హామీ ఏమైంది? 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నా మాటలు ఎక్కడికి పోయాయి? మేక్ ఇన్ ఇండియా? అచ్చేదిన్ కార్యక్రమాలన్ని అమలయ్యాయా అని ప్రశ్నించారు. కర్ణాటకలోనూ 2018 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారని అందులో 60 కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. పదేళ్లలో ఏం చేశారో బీజేపీ నేతలు సమాధానం చెప్పలన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యపై ఏనాడూ ప్రధాని మోడీ నోరు విప్పలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఈ సమస్య పెరిగిపోయిందన్నారు.



Next Story