బీజేపీ ఎన్ని జన్మలెత్తినా తమిళనాడులో గెలవలేదు: సీఎం స్టాలిన్

by Malleboina Mahesh |

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కేంద్ర మంత్రి అమిత్ షా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఎన్ని జన్మలెత్తినా తమిళనాడులో గెలవలేదు: సీఎం స్టాలిన్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కేంద్ర మంత్రి అమిత్ షా పై (Union Minister Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా తమిళనాడులో అధికారంలోకి రాలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనుకొగానే బీజేపీ అధికారంలోకి రావడానికి "ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు" అని స్టాలిన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేవలం అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, "ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు" అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా ఉన్నాయి.

Next Story