- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP: సోనియా గాంధీ మాఫీ మాంగో.. లోక్ సభలో బీజేపీ ఎంపీల నినాదాలు
వక్ఫ్ బిల్లు (Waqf Bill)పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గుర్రుగా ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బిల్లు (Waqf Bill)పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గుర్రుగా ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోనియా క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు లోక్ సభలో డిమాండ్ చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందన్న సోనియా ఆరోపణలను రాజ్యాంగంపై దాడి అని అధికార పార్టీ ఎంపీలు మండిపడ్డారు. బీజేపీ సభ్యులు "సోనియా గాంధీ మాఫీ మాంగో" (సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి) అని నినాదాలు చేశారు. మరోవైపు, ప్రతిపక్ష సభ్యులు అమెరికా సుంకాల అంశాన్ని లేవెనత్తారు. సుంకాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, శుక్రవారం లోక్ సభ కార్యకలాపాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి.
సోనియా ఏమన్నారంటే?
మరోవైపు, గురువారం సంవిధాన్ సదన్‌లో జరిగిన కాంగ్రెస్ (Congress) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నారు. అంతేకాక.. ఈ బిల్లుతో సమాజంలో శాశ్వత విభజన తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కమలం పార్టీ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు, పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుకి ఆమోదం లభించింది. ఇక, రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్ బిల్లు పేరును.. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ) ప్రభుత్వం పేర్కొంది.






