- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ముకశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి
జమ్ముకశ్మీర్లో రాజ్యసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకశ్మీర్లో రాజ్యసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్సీ మూడు స్థానాలు గెలుచుకోగా, బీజేపీ ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయింది. ఎన్సీ తరపున చౌధరి ముహమ్మద్ రంజాన్, సాజద్ కిచ్లూ, షమ్మీ ఒబెరాయ్‌లు విజయం సాధించారు. బీజేపీ తరపున సత్పాల్ శర్మ నాలుగో స్థానంలో గెలిచారు. అయితే బిజెపి క్రాస్ ఓటింగ్ వల్ల విజయం సాధించింది. అంటే కొంతమంది ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు రహస్యంగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 85 మంది అసెంబ్లీ సభ్యులు ఓటు వేశారు. కానీ స్పీకర్ మాత్రం ఓటు వేయలేదు.
అలాగే పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సాజద్ గణి లోన్ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ 42, కాంగ్రెస్ 6, బీజేపీ 29 సీట్లు గెలిచి, ఎన్సీ-కాంగ్రెస్-సిపిఐ(ఎం) కూటమి అధికారంలో ఉన్నప్పటికీ... బీజేపీ క్రాస్ ఓటింగ్‌తో ఒక సీటు సాధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.






