Delhi : శీష్ మహల్‌కు ఢిల్లీ సీఎం దూరం !

by Shamantha N |

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రెండుదశాబ్దాల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే సీఎం ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

Delhi : శీష్ మహల్‌కు ఢిల్లీ సీఎం దూరం !
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రెండుదశాబ్దాల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే సీఎం ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈ సమయంలో ఢిల్లీ సీఎం నివాసం గురించి మరో వార్త వైరల్ గా మారింది. ఢిల్లీ కొత్త సీఎం శీష్‌ మహల్‌ (Sheesh Mahal)లో నివాసం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్‌ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా వాడేవారు. అయితే, ఆ బంగ్లాను ‘శీష్‌ మహల్‌ (అద్దాల మేడ)’గా బీజేపీ వర్ణించింది. ప్రజాధనాన్ని వాడుకుని కేజ్రీవాల్ సీఎం నివాసాన్ని 7-స్టార్‌ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. అందుకే తమపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు రాకుండా బీజేపీ జాగ్రత్తపడుతోంది. ఈ నేపథ్యంలో శీష్ మహల్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

సీఎం స్థానంపై ఊగిసలాట

ఇదిలాఉంటే.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్‌ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ గెలుపొందారు. ఆయనే సీఎం పోస్టు దక్కే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఈ అంశంపైనే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యాడు. అయితే, మోడీ విదేశా పర్యటన పూర్తయ్యాకే సీఎం ప్రమాణస్వీకారం వేడుకను నిర్వహించేందుకు కాషాయపార్టీ ప్రణాళికలు వేస్తోంది. అయితే, ఒకవేళ మహిళకు ఛాన్స్ ఇవ్వాలనుకంటే రేఖా గుప్తా, శిఖారాయ్ లలో ఒకరికి సీఎం పీఠం దక్కేలా కన్పిస్తోంది. ఎమ్మెల్యేలను కాకుండా సిట్టింగ్‌ ఎంపీల్లో ఎవరినైనా సీఎంగా ఎంచుకోవాలనుకుంటే తూర్పు ఢిల్లీ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి హర్ష్‌ మల్హోత్రా లేదా ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్‌ తివారీల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

Next Story