BJP : బంగ్లా చొరబాటుదారులకు ఆప్ మద్దతు.. స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు

by Sathputhe Rajesh |

బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

BJP : బంగ్లా చొరబాటుదారులకు ఆప్ మద్దతు.. స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్, జై భగవాన్ ఉప్కర్‌లు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంలో ఆప్ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఫేక్ ఓటర్ కార్డులు తయారు చేసి ప్రజాస్వామిక దేశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆప్ ఎమ్మె్ల్యేలు దర్యాప్తు సంస్థలకు ఎందుకు సహకరించడం లేదని ఫైర్ అయ్యారు.

‘ఆప్ ఎమ్మెల్యేలు గోయల్, జై భగవాన్ బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారు. వారికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. వారు ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు’ అని స్మృతి ఇరానీ అన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అక్రమంగా ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారన్న అభియోగాలపై ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్‌తో పాటు ఆయన స్టాఫ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో ఆదివారం ఉదయం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ జాతీయుల ముఠాను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే గోయల్‌కు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.

Next Story