- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ బడ్జెట్ కూతురికి జన్మనివ్వడం లాంటిది : BJP ఎమ్మెల్యే
కాంగ్రెస్ బడ్జెట్ కూతురికి జన్మనివ్వడం లాంటిది అంటూ బాంబు పేల్చారు రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలీ.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ కూతురికి జన్మనివ్వడం లాంటిది అంటూ బాంబు పేల్చారు రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలీ. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ను కొడుకు, కూతురితో పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు రాజస్థాన్ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడు బడ్జెట్స్ లో కొడుకులకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. కానీ గత కాంగ్రెస్ బడ్జెట్ మాత్రం కూతురికి జన్మనివ్వడం లాంటిది అంటూ వ్యాఖ్యానించారు.
తమది యువకులకు ఉద్దేశించిన బడ్జెట్ అంటూ వెల్లడించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ది వృద్ధులకు సంబంధించింది అంటూ పరువు తీసే ప్రయత్నం చేశారు. కొడుకు అంటే ఉపయోగకరం అని అర్థం వచ్చేలా బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కొడుకు పుట్టలేదని... అందుకే ప్రతి పక్షంలో ఉందని సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మహిళలను అవమానించే తరహాలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని నిప్పులు చెరుగుతున్నారు.






