- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fees Increased : ఆ రాష్ట్రంలో జనన..మరణ ధృవీకరణల రుసుం పది రెట్లు పెంపు!

దిశ, వెబ్ డెస్క్ : జనన, మరణ ధృవీకరణ పత్రాల(Birth and Death Certification) రుసుములను పది రెట్లు(Fees Increased) పెంచేసింది కర్ణాటక(Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government). ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.5గా ఉన్న జనన ధృవీకరణ పత్రం రుసుం ప్రస్తుతం రూ.50కి, రూ.2గా ఉన్న మరణ ధృవీకరణ పత్రం రుసుం రూ.20కి పెంచేసింది. అయితే నిబంధనల మేరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలు మొదటి 21 రోజులు ఉచితం. అంతలోగా సదరు సర్టిఫికెట్లు పొందని వారు వాటి కోసం రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
21 నుంచి 30 రోజుల మధ్య రూ.5గా ఉన్న ఈ సర్టిఫికెట్ల రుసుం ప్రస్తుతం రూ.20గా నిర్ణయించారు. అలాగే 30 రోజుల తర్వాత ఐదు జనన ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి గతంలో రూ.25 ఉండగా ప్రస్తుతం రూ.250కు పెరిగింది. పది రెట్లు మేర పెంచిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల రేట్లు ఫిబ్రవరి 4 నుంచి అమలులోకి వచ్చాయి. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై చార్జీల భారాన్ని మోపడం పట్ల ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నుండిపడింది.
ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై భారం వేస్తున్నదని బీజేపీ సీనియర్ నేత బసనగౌడ పాటిల్ ఆరోపించారు. ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదాయం పెంపు పేరుతో ప్రజలపై పన్నులు, చార్జీల భారం వేస్తుందనని..ఇప్పటికే బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచిందని విమర్శించారు. కొత్తగా జనన, మరణ ధృవీకరణ పత్రాల రుసుములను పది రెట్లు పెంచేసిందని..మునుముందు మరిన్ని ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రజలు తిరుగబడాలని పిలుపునిచ్చారు.