Bill Gates: ఏఐ సదస్సుకు బిల్ గేట్స్ నిజంగానే దూరం అయ్యారా? క్లారిటీ ఇదే

by Prasad Jukanti |

ఐఏ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరమవుతున్నారన్న ప్రచారంపై గేట్స్ ఫౌండేషన్ క్లారిటీ ఇచ్చింది.

Bill Gates: ఏఐ సదస్సుకు బిల్ గేట్స్ నిజంగానే దూరం అయ్యారా? క్లారిటీ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) భారత పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు (AI Impact Summit) ఆయన దూరంగా ఉండబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చింది. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం సమ్మిట్ లో బిల్ గేట్స్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఇవాళ సమ్మిట్ లో పాల్గొనే ముఖ్యుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీంతో ఆయన ఈ సమ్మిట్ కు దూరంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. లైంగిక వేధింపుల నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ స్నేహం, ఇటీవల విడుదలైన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు వెలుగులోవచ్చింది. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఎఫెక్టు వల్లే ఈ సమ్మిట్‍కు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

క్లారిటీ ఇచ్చిన ఫౌండేషన్:
జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ క్లారిటీ ఇచ్చింది. బిల్ గేట్స్ తన షెడ్యూల్ ప్రకారం ఏఐ సమ్మిట్ కు హాజరవుతారని ఆయన ప్రసంగిస్తారని గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ఓ న్యూస్ ఎజెన్సీకి వివరణ ఇచ్చారు. బిల్ గేట్స్ హాజరుపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. కాగా బిల్ గేట్స్ గురువారం ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేయనున్నారు. కాగా గేట్స్ నిన్న ఏపీలో పర్యటించారు.
Next Story