స్మృతి ఇరానీ సీరియల్‌లో నటించనున్న బిల్ గేట్స్

by Malleboina Mahesh |

ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు భారతీయ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సీరియల్ “క్యుంకి సాస్ భీ కభీ బహూ థీ”లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

స్మృతి ఇరానీ సీరియల్‌లో నటించనున్న బిల్ గేట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇప్పుడు భారతీయ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన “క్యుంకి సాస్ భీ కభీ బహూ థీ” సీరియల్ ("Kyunki Saas Bhi Kabhi Bahu Thi" serial) లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ భారీ చర్చకు దారి తీసింది. బాంబే టైమ్స్‌ సమాచారం ప్రకారం, బిల్ గేట్స్ సీరియల్‌లో టుల్సీ (Smriti Irani)తో వీడియో కాల్ ద్వారా మాతృ, శిశు ఆరోగ్యంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇది మూడు ఎపిసోడ్‌ల ప్రత్యేక కథాంశం (Three special episodes)లో భాగమవుతుందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ సన్నివేశం ద్వారా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (Bill and Melinda Gates Foundation) చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను సీరియల్‌ కథలో భాగంగా చూపించనున్నారు. అంటే, ఇప్పటి వరకు కుటుంబ సమస్యలు, కుట్రలతో నిండిన టుల్సీ కథ (Tulsi story)లో ఇప్పుడు సామాజిక అంశం కూడా మిళిత మవుతోంది. స్మృతి ఇరానీ గతంలో ఈ సీరియల్‌తో భారత టీవీ రంగాన్ని కుదిపేసిన స్టార్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు బిల్ గేట్స్‌తో వర్చువల్‌ సీన్‌ ఉండడం టెలివిజన్ చరిత్రలో అరుదైన సంఘటన గా చెప్పుకోవచ్చు. అభిమానులు ఈ కలయికను సరదాగా “క్యుంకి సాస్ భీ కభీ బిలియనీర్ థీ” అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పంచుకుంటున్నారు.

Next Story