- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి నిబంధనతో విసిగిపోయిన విద్యార్థి.. బట్టలు విప్పేసి పరీక్ష రాశాడు..
by Sujitha Rachapalli |
ఛత్తీస్ గఢ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన నియామక పరీక్ష వివాదానికి కేంద్రంగా మారింది. ఓ విద్యార్థి ఏకంగా డ్రెస్ విప్పి ఎగ్జామ్ రాసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన నియామక పరీక్ష వివాదానికి కేంద్రంగా మారింది. ఓ విద్యార్థి ఏకంగా డ్రెస్ విప్పి ఎగ్జామ్ రాసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్డు బాయ్, వార్డు ఆయాకు సంబంధించిన 100 పోస్టులకు గాను ఆదివారం పలు సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించారు. అయితే ముదురు రంగు దుస్తులు, ఫుల్ స్లీవ్స్ అనుమతించేది లేదని డ్రెస్ కోడ్ పెట్టారు. కానీ కొందరు అభ్యర్థులు అలాగే రావడంతో.. పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. అయితే బిలాస్‌పూర్ సీఎండీ కళాశాల కేంద్రంలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థి వినయ్ సాగర్ బ్రౌన్ రంగు టీషర్టు ధరించి రావడంతో.. లోపలికి అనుమతించలేదు. దీంతో వినయ్ టీషర్టు తీసేసి.. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లిపోయాడు. అలాగే పరీక్ష కంప్లీట్ చేశాడు.
Next Story






