రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు బాహుబలిలా మారిన బైకర్..!

by Ramesh Goud |   (  Updated:2025-03-09 15:38:33  IST  )

రైల్వే క్రాసింగ్ (Railway Crossing) ను దాటేందుకు ఓ బైకర్ (Baiker) బాహుబలిలా (Bahubali) మారిన ఘటన న్యూఢిల్లీ (New Delhi)లో జరిగింది.

రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు బాహుబలిలా మారిన బైకర్..!
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే క్రాసింగ్ (Railway Crossing) ను దాటేందుకు ఓ బైకర్ (Baiker) బాహుబలిలా (Bahubali) మారిన ఘటన న్యూఢిల్లీ (New Delhi)లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రైల్వే క్రాసింగ్ ఉన్న చోట ప్రమాదాలు జరగకుండా రైల్వే సిబ్బంది గేటును ఏర్పాటు చేస్తారు. రైలు వచ్చే సమయంలో పట్టాలపై ఎవరు వెళ్లకుండా గేటు వేసి ప్రమాదాలను నియంత్రిస్తారు. రైల్వే మార్గంలో ఉన్న రోడ్డు రహదారి ప్రాంతాన్ని రైలు దాటేంత వరకు ప్రయాణికులు గేటు వద్ద వేచి ఉండాల్సిందే. క్రాసింగ్ వద్ద నుంచి రైలు వెళ్లాక గేటు ఓపెన్ చేసి రోడ్డు ప్రయాణదారులు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.

అయితే ఈ క్రమంలోనే రైల్వే గేటు (Railway Gate) వద్ద వేచి ఉండటాన్ని సహించలేకపోయిన ఓ బైకర్ పెద్ద సహసమే చేశాడు. ఘటన ప్రకారం ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్దకు రాగానే రైలు వస్తుందని రైల్వే సిబ్బంది వాహనదారులు రైలు పట్టాలను దాటకుండా గేటును వేశారు. ఈ సమయంలో ఆ వ్యక్తి వేచి ఉండలేక ఏకంగా బైక్ (Bike) ను ఎత్తి భుజం పై వేసుకున్నాడు. బైకును చంటి పాపలా మోసుకుంటూ.. రైలు గేటు పక్క నుంచి వెళ్లి పట్టాలు దాటాడు. ఇది చూసిన తోటి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ (Viral) గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఆ బైకర్ చేసిన సహసాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు ఆ వ్యక్తి చేసిన పని ప్రమాదకరమైనదని, ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని కామెంట్లు పెడుతున్నారు.

READ MORE ...

SSMB29 Leak : మహేష్ - రాజమౌళి షూటింగ్ సీన్స్ లీక్... నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలు


Next Story