బిహార్ రెండో దశ పోలింగ్ ప్రారంభం.. బరిలో 1,302 మంది అభ్యర్థులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 01:32:12  IST  )

బిహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

బిహార్ రెండో దశ పోలింగ్ ప్రారంభం.. బరిలో 1,302 మంది అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6.30కి అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను సీల్ చేశారు. మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయం ముగిసినా పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు

ఇక రెండో దశ పోలింగ్‌లో 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 1.95 కోట్ల మంది పురుషులు, 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందుకోసం అధికారులు 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 లక్షలకు పైగా వివిధ కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండో దశ పోలింగ్‌లో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, మంత్రులు రేణు దేవి, జమా ఖాన్, సుమిత్ సింగ్ వంటివారు బరిలో ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో AIMIM బలమైన పోటీ ఇస్తోంది. ఇందులో ఇమామ్‌గంజ్, జహానాబాద్, భగల్‌పూర్ నియోజకవర్గాలు హాట్ సీట్లుగా ఉన్నాయి. మొదటి దశలో 65.08 శాతం రికార్డు పోలింగ్ నమోదైంది. రెండో దశలోనూ భారీ ఓటింగ్ జరుగుతోందని తొలి నివేదికలు చెబుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.

Next Story