బీహార్ రెండో దశ పోలింగ్.. ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు

by Malleboina Mahesh |

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఈ రెండో దశల 3.70 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బీహార్ రెండో దశ పోలింగ్.. ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌ (Final phase of polling) ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఈ రెండో దశల 3.70 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 20 జిల్లాల్లో మొత్తం 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు బరిలో 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారుల ముందస్తు చర్యల కారణంగా మొదటి విడత పోలింగ్ శాతం పెరగగా.. తుది విడతలో సైతం ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.

ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. ప్రధాని తన ట్వీట్‌లో "ప్రజలందరూ ప్రజాస్వామ్య హక్కును వినియోగించి, ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటరుకి భాగస్వామ్యం ఉండాలని, ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్‌ నమోదు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రత్యేకంగా రాష్ట్రంలోని మొదటిసారి ఓటు వేయబోతున్న యువతకు పిలుపునిస్తూ, వారు తమ ఓటు హక్కును వినియోగించడమే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహించాలని ప్రధాని మోడీ కోరారు. యువత సక్రియంగా పాల్గొనడం వలన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని, ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి పౌరుడి సహకారం అవసరమని ఎన్నికల అధికారులు తెలిపారు.

Next Story